మహానటి సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్ . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అలాగే కీర్తి సురేష్ కు వరుస అవకాశాలను తీసుకువచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. తమిళ స్టార్ కమెడియన్ వడివేలు సినిమాలో కీర్తి సురేష్ నటించిన పోతున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోలతో, ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు వడివేలు తో నటించడానికి సిద్ధమవడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.
Advertisements
అందుకు కారణం కూడా లేకపోలేదట. కీర్తి పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. అందుకే ఇలాంటి పాత్ర చేయడానికి కీర్తి సురేష్ కూడా ఒప్పుకుందని సమాచారం. అయితే ఈమె వడివేలు సరసన హీరోయిన్‌గా కనిపిస్తారా లేక సినిమాలో కీలకపాత్ర పోషిస్తారా అనేది తెలియాల్సి ఉంది.