ఈ రోజుల్లో హీరోయిన్లు ఓ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేస్తే అనేక రూమర్స్ తెరపైకొస్తాయి. చెత్త కండిషన్స్ పెట్టిందని.. ఎక్కువ చేస్తోందని.. ఇలా అనేక రకాల వదంతులను సృష్టిస్తారు. ప్రస్తుతం నటి కీర్తి సురేష్ కి అదే ఎదురైంది.
ప్రస్తుతం కీర్తిని నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. దానికి కారణం పొన్నియన్ సెల్వన్ లో అవకాశాన్ని వదులుకోవడమే. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కీర్తిని తీసుకోవాలని భావించారట. అయితే.. ఆమె ఈ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేసింది.
మణిరత్నం చిత్రంలో అవకాశమొస్తే వదులుకుంటారా? అని నెటిజన్లు కీర్తిని ట్రోల్ చేస్తున్నారు. చాలా తెలివి తక్కువగా వ్యవహరించిందని కొందరు.. ఓవర్ చేస్తోందని మరికొందరు.. ఇలా అనేక రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది.
నిజానికి కీర్తి ఈ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేయడానికి కారణం. సర్కారు వారి పాట సినిమానే అని ఆమె ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆ మూవీ షూటింగ్ లో బిజీగా ఉండటంతో డేట్స్ లేని కారణంగానే వదులుకుందని అంటున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన సర్కార్ వారి పాట మంచి హిట్ సాధించింది.