న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల వరుసగా డిఫరెంట్ కథలతో వస్తూ ప్రేక్షకులని మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. త్వరలో నాని, కీర్తి సురేష్ జంటగా దసరా అనే పూర్తి మాస్ సినిమాతో మార్చ్ 30న థియేటర్స్ లోకి రాబోతున్నాడు. తాజాగా నాని ఫిబ్రవరి 24న తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు. శుక్రవారం నాని పుట్టినరోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు నానికి బర్త్ డే శుభాకాంక్షలు చెప్పారు.
ఈ నేపథ్యంలో మహానటి కీర్తి సురేష్ నానికి స్పెషల్ గా విషెష్ చెప్పింది. నాని, కీర్తి సురేష్ కలిసి గతంలో నేను లోకల్ సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. నేను లోకల్ సినిమా అప్పట్నుంచే నాని, కీర్తి మంచి స్నేహితులుగా మారారు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో దసరా సినిమా రాబోతుంది. ఇప్పటికే దసరా సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
నాని పుట్టిన రోజు అవ్వడంతో దసరా సినిమా షూటింగ్ లో ఖాళీ ఉన్నప్పుడు నాని, కీర్తి సురేష్ కలిసి షటిల్ ఆడిన వీడియోని పోస్ట్ చేసింది. ఇందులో సరదాగా షటిల్ ఆడుతూ, సరదాగా పోట్లాడుకున్నారు కూడా.
ఈ వీడియోతో పాటు నాని ఫోటో, నాని ఫ్యామిలీతో కీర్తి సురేష్ ఉన్న ఫోటోలని షేర్ చేసి.. నా ఫ్రెండ్, నా వెల్ విషర్, నా కో-స్టార్, ఎప్పుడూ సినిమా గురించే మాట్లాడే వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మన సినిమా సెలబ్రేషన్స్ కు ఇంకా 40 రోజులు కన్నా తక్కువే ఉన్నాయి. 2023 కుమ్మేసేయ్ ధరణి అంటూ పోస్ట్ చేసింది. దీంతో కీర్తి, నాని కలిసి షటిల్ ఆడిన వీడియో వైరల్ గా మారింది.