కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి. చూడచక్కని రూపంతో పాటు.. నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. అయితే.. ఈ ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి.
నేను శైలజ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి.. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. తన సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేస్తుంది.. కానీ ఎప్పుడూ హద్దులు దాటేలా అందాలు ఆరబోయలేదు. నటనతోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని.. సౌత్ టాప్ హీరోయిన్ల సరసన చేరింది. కీర్తి సురేష్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు ఉంది. సముద్రంలో బోటింగ్ చేసేందుకు రెడీ అవుతోంది.
ఒడ్డున నిలబడి రెడ్ బాడీ కాన్ డ్రెస్ లో హాట్ హాట్ మిర్చిలా కీర్తి ఇస్తున్న ఫోజులు… అదుర్స్ అనిపిస్తున్నాయి. స్టైలిష్ గా కనిపిస్తూనే హాట్ నెస్ తో అదరగొడుతోంది. ఇటీవల మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటించిన కీర్తి.. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయం దక్కించుకుంది.
సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ ని పరశురామ్ అందంగా ప్రజెంట్ చేశారు. మ.. మ.. మహేషా సాంగ్ లో కీర్తి మాస్ స్టెప్పులతో రెచ్చిపోయింది. మహేష్ తో కలసి కామెడీ టైమింగ్ ని కూడా కీర్తి అద్భుతంగా పండించింది. ఇటు.. మహానటి చిత్రంలో కీర్తి సురేష్ నట విశ్వరూపమే ప్రదర్శించింది. సావిత్రి పాత్రలో ఆమె ఒదిగిపోయి నటించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి.
దీంతో దర్శకులు కూడా కీర్తి సురేష్ ని గ్లామర్ రోల్స్ తో పాటు.. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు ఎంపిక చేసుకుంటున్నారు. అలాగే.. కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైంది. ఈ చిత్రాల్లో ఆమె చిరంజీవి సోదరిగా నటించబోతోంది. దీంతో కీర్తి మరింతగా అభిమానులను సాధించుకునే అవకాశం ఉందంటున్నారు సినీ అభిమానులు.