మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో నితిన్ తో రంగ్ దే సినిమా చేస్తోంది. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో నటించబోతుంది. అదే విధంగా మరో వైపు చిరంజీవి హీరోగా రాబోతున్న వేదాళం రీమేక్ లో కీర్తి సురేష్ నటించనుంది.
అయితే తాజా సమాచారం ప్రకారం సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సరసన కూడా ఈ అమ్మడికి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. దేవకట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించనున్నారు.