ఇటీవల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పెద్దక్కగా అభివర్ణించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా టీఎంసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. గోవాలో టీఎంసీ రేసులో ఉన్నట్టు తాను భావించడంలేదని అన్నారు. అసలు ఆ పార్టీ ఆనవాళ్లు కూడా గోవాలో లేవని అన్నారు. మీరు టీఎంసీకి ప్రాధాన్యం ఇస్తున్నారేమో కానీ.. టీఎంసీకి ఒక్కశాతం ఓటింగ్ కూడా లేదని మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. 3 నెలల క్రితమే గోవా అడుగుపెట్టిన టీఎంసీకి పునాదులు లేవని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ఉండాలంటే కష్టపడి పని చేయాలని.. క్షేత్ర స్థాయిలో బలంగా ఉండాలని ఢిల్లీ సీఎం తెలిపారు. ఇటీవల మమతా బెనర్జీతో భేటీ అయిన కేజ్రీవాల్ ఆమెన్ పెద్దక్క అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు అలెక్సో రెజినాల్డో లోరెన్కో ఆ పార్టీ రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.