ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. దాదాపు అన్ని రాష్ట్రాల సీఎంలు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
అందులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఉన్నారు. కాగా.. రాష్ట్రాల్లో కొవిడ్-19 పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతుండగా.. కేజ్రీవాల్ ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కేజ్రీవాల్ తన చేతులు రెండు పైకెత్తి తలపై పెట్టుకున్నారు.
కేజ్రీవాల్ బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించిన తీరు.. హావభావాల దృశ్యాలు వీడియో కాన్ఫరెన్స్ సమయంలో రికార్డు అయ్యాయి. ఇప్పుడా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పలువురు బీజేపీ నేతలు విమర్శలు చేశారు. వీడియోను షేర్ చేస్తూ “మర్యాద లేని వ్యక్తిష అరవింద్ కేజ్రివాల్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఒక రాష్ట్ర సీఎం అయి ఉండి.. దేశ ప్రధానితో ఎలా నడుచుకోవాలో తెలియదా అంటూ చురకలు అంటించారు. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ఇదే వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. “అరవింద్ కేజ్రీవాల్ అసభ్య ప్రవర్తనతో తనను తాను అప్రతిష్టపాలు చేసుకున్నాడు” అని అన్నారు.