మూడోసారి ఢీల్లీ సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నాడు కేజ్రీవాల్. దేశ రాజధానిలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ కేంద్ర మంత్రులను, ఎంపీలను ప్రచారంలోకి దింపిన ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. హస్తిన వాసులంతా మరోసారి ఆప్ కే పట్టం కట్టారు. ఇదిలా ఉండగా సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎవరెవరు హాజరు అవుతారనే దానిపై చర్చ నడుస్తోంది. కేజ్రీవాల్ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించే పనిలో ఉన్నారు. ఇప్పటికీ ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆయన ఆహ్వానించనేలేదు. కానీ ఎవ్వరు ఊహించని విధంగా ఈ కార్యక్రమానికి ఓ స్పెషల్ గెస్ట్ కు ఆహ్వానము పంపారు.
ఈ ఢీల్లీ సీఎం ఎంపిక చేసిన ఆ ప్రత్యేక ఆహ్వానితుడు మరెవరో కాదు.. ఢీల్లీ ఎన్నికల ఫలితాల రోజున కేజ్రీవాల్ గా అందర్నీ ఆకట్టుకున్న బుడతడికి కేజ్రీవాల్ స్పెషల్ ఇన్విటేషన్ పంపారు. ఎన్నికల ఫలితాల రోజున అచ్ఛం కేజ్రీవాల్ లాగే అందర్నీ కనువిందు చేశాడు. ఆ బుడతడు కుటుంబం కూడా ఆప్ కార్యకర్తలే. ఆ బుల్లి కేజ్రీవాల్ వేషధారణ అచ్ఛం కేజ్రీవాల్ నే పోలి ఉండటంతో చాలామంది అతనితో ఫోటోలు దిగేందుకు జనాలు ఆసక్తి కనబరిచారు.అతని ఫోటోలు మీడియాలో కాకుండా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. బుల్లి కేజ్రీవాల్ గా ఆకట్టుకున్న అతని సీఎం ప్రమాణ స్వీకార వేడుకకు స్పెషల్ గెస్ట్ గా క్రేజీ ఇన్విటేషన్ పంపాడు కేజ్రీవాల్.