పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం ఆమోదించడాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పనికి మాలిన చర్యగా కొట్టిపడేశారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పినట్టుగా ఆ తీర్మానానికి రాజ్యాంగ బద్ధత లేదన్నారు. పౌరసత్వ అంశం ప్రత్యేకంగా కేంద్రానికి సంబంధించినదని..కాబట్టి కేరళ అసెంబ్లీ తీర్మానం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ కేరళ అసెంబ్లీ లో ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సీపీఎం నేతృత్వంలోని అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ తో పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూడా మద్దతు తెలిపింది. దీంతో తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందింది.