కేరళలో బీజేపీ ఎదగకపోవడానికి కారణమేంటి అంటే.. సాధారణంగానే సౌత్‌లో బీజేపీకి పెద్దగా ఆదరణ లేదు కాబట్టి బలం పెంచుకోలేకపోయిందని చెప్తుంటారు. మతతత్వ పార్టీ కాబట్టి ఎదగలేకపోయిందని అంటారు. కానీ కేరళలో బీజేపీ ఎదగకపోవడానికి కారణం ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు కనిపెట్టేశారు. చదువుకున్న ప్రజలు ఎక్కువగా ఉండటం వల్లే అక్కడ తమ పార్టీ కేరళలో ప్రభావం చూపించలేకపోతోందని బీజేపీ ఎమ్మెల్యే రాజగోపాల్ చెప్పుకొచ్చారు.
అక్షరాస్యత చాలా ముఖ్యమైన అంశమని.. కేరళలో 90 శాతం అక్షరాస్యత ఉండటంతో ఇక్కడి ప్రజలు ఆలోచించి ఓటేస్తారని ఆయన చెప్పారు. అలాగే విద్యావంతులు చెప్పిన మాటలు వినకుండా..మొండి వాదనలు చేస్తారని అభిప్రాయపడ్డారు. అందుకే కేరళలో 55 శాతం హిందువులు, 45 శాతం మైనారిటీలు ఉన్నా.. చదువుకున్న వారి వల్లే ఇక్కడ బీజేపీ ఎదగడం లేదని నిర్ధారణకొచ్చాడు ఎమ్మెల్యే రాజగోపాల్.
విచిత్రంగా మొన్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిందని… దీనిపై మీ కామెంట్ ఏంటీ అని జర్నలిస్టులు సీఎం పినరయిని అడిగారు. అప్పుడాయన కూడా అవునూ… మా రాష్ట్రంలో అక్షరాస్యత ఇంకా పెంచాల్సి ఉంది అని సమాధానం ఇవ్వడం గమనార్హం.