బహిష్కృత బీజేపీ నేత నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ను టార్గెట్ చేసుకుని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రజలంతా ఏకమై మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా గళమెత్తాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల ముందు మన లౌకిక ప్రజాస్వామ్యాన్ని సంఘ్ పరివార్ మరోసారి అపహాస్యం చేసిందన్నారు.
అంతకు ముందు నూపుర్ శర్మ వ్యాఖ్యలపై గల్ఫ్ దేశాలు నిరసన తెలిపాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ… భారత్ ను ఆర్ఎస్ఎస్ ఇబ్బందుల్లోకి నెట్టిందని మండిపడ్డారు.
విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు సంఘ్ పరివార్ ఎజెండాలో భాగమేనని ఆయన ఆరోపించారు.