కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ శనివారం ఢిల్లీలో జె.ఎన్.యు స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయిషే ఘోష్ ను కలిశారు. అనంతరం తన ఫేస్ బుక్ పోస్టులో వారిని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ”సంఘ్ పరివార్ కు వ్యతిరేకంగా విద్యార్ధులు రాజీ లేని పోరాటం చేస్తున్నారన్నారు. ” న్యాయ పోరాటం చేస్తున్న జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్ధులకు దేశం మొత్తం అండగా ఉంది..మీ నిరసన అందరికి తెలుసు…మీకేం జరిగిందో…ఏ న్యాయం కోసం పోరాడుతున్నారో తెలుసు” అని పినరయ్ విజయన్ రాశారు.
తలకు గాయాలైనా పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారని అయిషే ఘోష్ ను కొనియాడారు. తమను వ్యతిరేకించే వారిని కండబలంతో అణిచివేయవచ్చని సంఘ్ పరివార్ భావిస్తోంది…కానీ జె.ఎన్.యు విద్యార్ధులు వారితో రాజీ లేని పోరాటం చేస్తున్నారు..అయిషే ఘోష్ దానికి నాయకత్వం వహిస్తున్నారని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఫేస్ బుక్ లో రాశారు.