కేరళలోని కొచ్చిలో శనివారం ఉదయం రెండు రెండు లగ్జరీ అపార్ట్ మెంట్ల సముదాయాన్ని సెకన్లలో కూల్చివేశారు. మరదులో ఖరీదైన లేక్ సైడ్ లొకేషన్లో నిర్మించిన రెండు అపార్ల్ మెంట్లలో 350 కి పైగా ఫ్లాట్లు ఉన్నాయి. వాటిలో 240 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇండియాలో మొదటిసారిగా అతిపెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ను కేరళ ప్రభుత్వం నేలమట్టం చేసింది. కోస్టల్ రెగ్యులరైజేషన్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన అపార్ట్ మెంట్లను కూల్చివేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం ఈ కూల్చివేతకు పాల్పడింది.90 ఫ్లాట్లున్న 19 అంతస్తుల H2o హోలీఫెయిత్ కాంప్లెక్స్ ను ముందుగా కూల్చేశారు. ఆ తర్వాత సెకన్ల వ్యవధిలోనే ఆల్ఫా సెరెనె జంట టవర్స్ ను కూల్చేశారు.