మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కు కేరళ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లైంగిక వేధింపుల కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ ఉన్ని ముకుందన్ వేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.
ఫిబ్రవరి 2023లో ఈ కేసుపై విధించిన స్టేను తాజాగా కేరళ హైకోర్టు ఎత్తివేసింది. ఈ కేసులో ఫిర్యాదు చేసిన మహిళతో సెటిల్ మెంట్ కూడా కుదిరిందని ఊహాగానాలు కూడా వచ్చాయి. ఆ రూమర్స్ కు హైకోర్ట్ ఫుల్ స్టాప్ పెట్టేసింది.
కాగా 2017 ఆగష్టు 23న ఓ సినిమా ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకు కొచ్చిలోని ఎడపల్లిలోని తన నివాసానికి వచ్చిన ముకుందన్.. తనపై దాడికి పాల్పడ్డాడని బాధితురాలు సెప్టెంబర్ 15, 2017లో పోలీసులకు ఫిర్యాదులో చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను ఉన్ని ముకుందన్ ఖండించారు.
అంతేకాకుండా ఆమెపై పరువు నష్టం దావా కేసును కూడా దాఖలు చేశాడు. కేసు సెటిల్ మెంట్ కోసం ఆమె రూ.25 లక్షలు డిమాండ్ చేసిందని కూడా ఆరోపించాడు. ఇందులో భాగంగానే ఉన్ని ముకుందన్ ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాడు. కానీ హైకోర్ట్ ఉన్ని ముకుందన్ కు షాకిచ్చింది.