నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నంలో దుండగులు వారి నుండి తప్పించుకునేందుకు ఎంతటి దారుణానికి అయినా ఒడి కడుతుంటారు. అయితే.. నిందుతులను పట్టుకునే ప్రయత్నంలో వారు పోలీసులపై కత్తులతో దాడి చేయడం సహజంగా సినిమాల్లో చూస్తుంటాం. కానీ.. నిత్య జీవితంలోనూ ఓ నిందితుడు సినిమాను మైమరిపించేలా అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారిపై కత్తితో దాడి చేశాడు.
నిందితుడితో వీరోచితంగా పోరాడిన పోలీసు అధికారి ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అలప్పుజ జిల్లా కాయంకులమ్ లోని పారా జంక్షన్ వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే.. వారికి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడి ముందు పోలీసు జీపు ఆపి ఎస్సై కిందకు దిగాడు. ఎందుకు ఆపుతున్నారు..? ఏమైంది..? అనే వివరాలేమి అడగకుండానే వెంటనే అప్రమత్తమైన దుండగుడు సుగతన్.. తన వద్ద ఉన్న భారీ కత్తితో ఎస్సైపై దాడికి పాల్పడ్డాడు.
అయితే దుండగుడి దాడి నుంచి తప్పించుకుంటూ.. ప్రాణాలను లెక్కచేయకుండా ఎస్సై అతడిని నిలువరించాడు. పెనుగులాటలో ఇద్దరూ కిందపడిపోగా.. దుండగుడిని చాకచక్యంగా అరికట్టి అదుపులోకి తీసుకొని చేతిలోని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై పై దుండగుడు కత్తితో దాడి చేసినప్పుడు తొలుద కత్తితో ఎస్సైని నరికాడు. దీంతో ఎస్సై చేతికి గాయమై ఏడు కుట్లు పడ్డాయి.
Advertisements
ఇంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఎస్సై వివరాలను కేరళ పోలీసులు వెల్లడించారు. ఆయన అలప్పుజ నూరానడ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అరుణ్ కుమార్ అని స్పష్టం చేశారు. కాగా.. హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తన్న అదనపు డీజీ స్వాతి లక్రా ఆ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఎస్సై ధైర్యసాహసాలను కొనియాడారు. రియల్ హీరోలు ఇలాగే ఉంటారని ప్రశంసించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.