కేరళలో బిషప్ ఫ్రాంకో ములక్కల్ లైంగిక వేధింపులపై తీవ్ర నిరసన వ్యక్తం చేసి చర్చి నుంచి బహిష్కరణకు గురైన సిస్టర్ లూసీ చర్చిలో మత పెద్దల లైంగిక వేధింపులపై పుస్తకం రాసినట్టు చెప్పారు. ”కర్తావింటే నామాతిల్ (దేవుని పేరు మీద )” అనే టైటిల్ తో రాసిన ఆ పుస్తకంలో తాను ఎదుర్కొన్న మత పెద్దల లైంగిక వేధింపులను పూసగుచ్చినట్టుగా రాశానన్నారు. తన పుస్తకంలో కేవలం బిషప్స్, పాస్టర్ల నుంచి నన్స్ ఎదుర్కొన్న లైంగిక వేధింపుల అనుభవాలే ఉంటాయని చెప్పారు. మత పెద్దల లైంగిక వేధింపుల విషయం అందరికీ తెలుసునని..అయినా ఎవరు ఈ విషయంపై మాట్లాడడానికి ముందుకు రారు అన్నారు
2000-2003 లో తనకు మత పెద్దల నుంచి చేదు అనుభవం ఎదురైందని…నరకం అనుభవించానని… ఆ అనుభవాలను రికార్డు చేయాలని అప్పుడే అనిపించి 2004-05 నుంచే తాను తన అనుభవాలను రాయడం మొదలు పెట్టానని లూసీ వెల్లడించారు. లైంగిక దాడుల గురించి మాట్లాడుతూ చర్చి లీడర్స్ మొదట బాధిత సిస్టర్స్ కు సపోర్ట్ చేసినా… ఆ తర్వాత నిందితులకే సపోర్ట్ చేస్తారన్నారు. ఇవి క్రీస్తు బోధనలకే విరుద్ధమని చెప్పారు.
బిషప్ ఫ్రాంకో ములక్కల్ లైంగిక వేధింపులపై నిరసన వ్యక్తం చేయడంతో ఆమెను చర్చి నుంచి బహిష్కరించారు. చర్చి నిబంధలను ఉల్లంఘించి కారు లోన్ తీసుకుందని..పెద్దల అనుమతి లేకుండానే డబ్బులు ఖర్చు చేసిందనే కారణాలు చూపారు. అవన్నీ తనను చెడ్డదిగా చిత్రీకరించడానికి చేసిన ఆరోపణలన్నారు. బిషప్ ములక్కల్ ఇండియాలో రోమన్ కేథలిక్ క్లెర్జీకి చెందిన సీనియర్ మెంబర్. లూసీ లైంగిక వేధింపుల ఫిర్యాదుతో ఫ్రాంకో ములక్కల్ ను గత ఏడాది పోలీసులు అరెస్ట్ చేశారు.