డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ హీరోగా వస్తున్న సినిమా రొమాంటిక్. ఈ సినిమాలో ఆకాష్ పూరీ సరసన కేతిక శర్మ నటిస్తుంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఇంకా రాలేదు. అయినప్పటికీ మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుంది.
యంగ్ హీరో నాగశౌర్య సరసన నటించే అవకాశం కేతికకు దక్కింది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఆసియన్ సునీల్ నిర్మాతగా, సంతోష్ జాగర్లమూడి డైరక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. విలువిద్య నేపథ్యంగా సాగే ఈ సినిమాలో నాగశౌర్య సిక్స్‌ప్యాక్‌లో కనిపించనున్నాడు. ఇటీవల బయటకు వచ్చిన నాగశౌర్య లుక్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో నాగశౌర్య సరసన కేతిక నటించబోతోంది.