ఇంగ్లాండ్ ఆటగాడు రోరి బర్న్స్ ఆటతీరు కాస్త భిన్నంగా ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత అరుదైన బ్యాటింగ్ స్టైల్ తో అతను ఆకట్టుకుంటాడు. బౌలర్ ను కన్ఫ్యూజ్ కూడా చేస్తూ మంచి షాట్లు ఆడటం అతని నైజం. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో ఈ తరహాలో బ్యాటింగ్ చేసే ఆటగాళ్లలో ఇతను ఒకడే. ఇటీవల భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఐదు టెస్ట్ల సిరీస్లో అతను పెద్దగా ఆకట్టుకోకపోయినా సరే కొన్ని మాత్రం చాలా జాగ్రత్తగా ఆడాడు.
ఇక అతని బ్యాటింగ్ స్టైల్ గురించి సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి. అతని శరీరానికి అతని తల కి అలాగే అతని కళ్ళకి అలాగే అతను పట్టుకుని బయటికి వ్యత్యాసం చాలా ఉంటుంది. సాధారణ బ్యాట్స్మెన్ ల కంటే కూడా భిన్నంగా బ్యాటింగ్ స్టైల్ ఉండటం అతని ఇంటర్నెట్ లో కాస్త హీరోని చేసింది. అయితే అలా ఆడటం వల్ల అతనికి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కూడా కొంత మంది అభిప్రాయపడ్డారు.
అయితే తాజాగా బర్న్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన బ్యాటింగ్ స్టైల్ అలా ఎందుకు ఉంటుంది ఏంటి అనే దానిపై అతను ఒక స్పష్టత ఇచ్చాడు. మన వ్యక్తిగత డాక్టర్ ని కలిసిన సమయంలో తనకు కుడికన్ను కంటే కూడా ఎడమ కన్ను ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని కాబట్టే తాను బంతిని సరిగా అంచనా వేయాలి అంటే అలాగే మంచి షాట్లు ఆడాలి అంటే కుడికన్ను కంటే కూడా ఎక్కువగా ఎడమకన్ను అయితేనే బాగుంటుందని చెప్పారని అందుకే తాను ఎడమకన్ను మీద ఆధారపడటానికి తన బ్యాటింగ్ స్టైల్ ని అలా మార్చుకున్నా అని అతను చెప్పడం గమనార్హం.