రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగు చూస్తున్నాయి.ఈ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచిన నేపథ్యంలో విస్మయకర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. నవీన్ ను చంపిన హరిహరకృష్ణకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరైనా సహకరించారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న నిందితుడు హరిహరకృష్ణను కస్టడీ నిమిత్తం తీసుకుని సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే.. హత్య జరిగిన రోజు ఉదయం 11 గంటలకు నల్గొండ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మృతుడు నవీన్.. రాత్రి 11 గంటల వరకు ఎవరెవరిని కలిశాడు.. ఎక్కడెక్కడ తిరిగాడో పోలీసులు ఆరా తీస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆరోజు మధ్యాహ్నం నవీన్.. నాగోల్‌లో హరిహరకృష్ణను కలిసినట్టు తెలుస్తోంది. హరిహరకృష్ణ, అతడి స్నేహితుడు జీవన్, మరో అమ్మాయితో కలిసి నవీన్ అక్కడే ఒక రెస్టారెంట్‌లో భోజనం చేసినట్లు సమాచారం. ఆ తర్వాత అమ్మాయి, జీవన్ అక్కడి నుంచి వెళ్లిపోగా.. హరిహరకృష్ణ, నవీన్‌ను తీసుకుని ముసారాంబాగ్‌కు… అక్కణ్నుంచీ బైక్‌పై పెద్దఅంబర్‌పేట్‌కు తీసుకువెళ్లాడు.
అప్పటికి సమయం రాత్రి 9 గంటలు అయ్యింది. ఓ వైన్‌షాప్‌లో మద్యం తీసుకుని ఇద్దరూ అక్కడే తాగారు. హరి హరికృష్ణ తక్కువ మద్యం తాగాడు.. నవీన్ కు ఎక్కువ మద్యం తాగించాడు. ఫలితంగా నవీన్ మత్తులో ఉండటంతో బండిమీద ఎక్కించుకొని రాత్రి 11.30 గంటల సమయంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న మరో జత దుస్తులను ధరించి.. స్నేహితుడైన హసన్ వద్దకు వెళ్లి, ఆ రాత్రికి అక్కడే పడుకుని ఉదయాన్నే వరంగల్‌కు వెళ్లినట్లు తెలిసింది.
పోలీసులకు ఆధారాలు లభించకుండా ఎలా హత్య చేయాలో యూట్యూబ్‌లో వీడియోలు చూసి తెలుసుకున్న హరిహరకృష్ణ.. నవీన్ హత్యకు ప్లాన్ చేసినట్టు సమాచారం. అందులో భాగంగానే హత్యా సమయంలో చేతికి గ్లౌజ్‌లు వేసుకున్నట్లు తెలుస్తోంది. హత్య అనంతరం ఉన్మాదిగా మారి.. నవీన్ గుండెను, పెదాలను, చేతి వేళ్లను, మెడను కోసివేసిన దృశ్యాలను చిత్రీకరించి, ఆ వీడియోలను యువతి ఫోన్‌కు పంపినట్లు సమాచారం.
అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. అలాగే.. ఈ నెల 24న పోలీసులకు లొంగిపోయే ముందు అతడు తన ఫోన్‌లోని వాట్సాప్ చాటింగ్‌ను, కాల్ డేటా మొత్తాన్నీ డిలీట్ చేశాడు. ఈ డేటాను హరిహరకృష్ణ డిలీట్ చేసినప్పటికీ.. నవీన్, ఆ యువతి ఫోన్లలో డేటా ద్వారా కొన్ని ఆధారాలు లభించే అవకాశం ఉండడంతో పోలీసులు వాటిని పరిశీలిస్తున్నట్టు సమాచారం.
నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేసిన తీరు గురించి కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో వివరించారు. ‘‘నవీన్ కు మద్యం తాగించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన హరిహరకృష్ణ.. బైక్ పై నుంచి కింద పడేశాడు, అతడు తేరుకునేలోగా గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత కత్తితో మెడ కోసి.. తలను మొండెం నుంచి వేరు చేశాడు. ఆ తర్వాత మర్మాంగాన్ని కోసేసి… నవీన్ శరీరం నుంచి గుండెను బయటకు తీశాడు. చేతి వేళ్లను కూడా కట్ చేసి అక్కణ్నుంచి పరారయ్యాడు’’ అని పోలీసులు పేర్కొన్నారు.
బైక్ డ్రైవ్ చేస్తున్న సమయంలో కూడా అతని చేతికి గ్లౌజులు ఉన్నాయని వారు అనుమానిస్తున్నారు. హత్యకు ముందుగానే నిందితుడు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించుకుని ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.