రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ లోని బోయగూడ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11మంది వలస కార్మికులు సజీవ దహనం అయ్యారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. కీలక విషయాలను వెల్లడించారు. అయితే.. షార్ట్ సర్క్యూట్ తో ఎగిసిపడిన నిప్పు రవ్వల కారణంగా.. అగ్ని ప్రమాదం జరిగినట్టు ఫైర్ సేఫ్టీ అధికారులు అంచనా వేస్తున్నారు.
కరెంట్ బోర్డులకు, గ్యాస్ సిలిండర్ పేలి భారీగా మంటలు వచ్చినట్టు అనుమానిస్తున్నారు. ఫ్యూజ్‌లు ఫెయిల్ అవడమే ఈ ప్రమాదానికి ముఖ్య కారణం అని చెప్తున్నారు. అయితే.. ఒక్కో ఫ్యూజ్‌లో అదనంగా మందమైన మూడు నాలుగు వైర్లు ఉన్నట్టు గుర్తించారు. అంతేకాకుండా కేబుల్ వయర్లు, ప్లాస్టిక్ వయర్లపై నిప్పురవ్వలు పడడం.. స్విచ్ బోర్డులు, గ్యాస్ సిలిండర్ పేలడం భారీ అగ్ని ప్రమాదానికి దారితీసినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు.
గోదాంలో కరెంట్ ఎక్కువ వాడడంతో షార్ట్ సర్క్యూట్ అయిందని.. దీంతో గ్రౌండ్ ఫ్లోర్ లో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయని చెప్తున్నారు. అందులో ఉన్నవి ఇనుప మెట్లు కావడంతో పైనున్న వారు కిందకు రాలేకపోయారని.. దట్టమైన పొగవల్ల సృహకోల్పోయి మంటల్లో చిక్కుకున్న వారు సజీవదహనం అయినట్టు నిర్దారించారు అధికారులు.
కాగా.. సదరు కార్మికులంతా రీయూనియన్ కోసం హైదరాబాద్ కి వచ్చిన వారిగా గుర్తించారు. క్లూస్ టీమ్ ఇన్చార్జ్ డాక్టర్ వెంకన్న నేతృత్వంలో 12 మంది సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. త్రీడీ స్కానర్‌తో సేకరించిన ఆధారాలు ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కు తరలించినట్టు వెంకన్న వెల్లడించారు.