ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయింది కేజీఎఫ్2 సినిమా. హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మేజిక్ చేశారు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా, అన్ని ఏరియాల్లో అందరి అంచనాల్ని అందుకుంది.
మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా బాక్సాఫీస్ ను దున్నేస్తోంది. ఇప్పటికే టాప్-2 పొజిషన్ కు చేరుకున్న ఈ మూవీ, మరో 2 వారాల పాటు గట్టిగా ఆడేలా కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా 25 రోజుల రన్ పూర్తి చేసుకుంది.
ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ సినిమా, ఈ 25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1145 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. సొంత రాష్ట్రం కర్నాటక కంటే, హిందీ బెల్ట్ నుంచే ఈ సినిమాకు ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమాకు ఇప్పటివరకు 134 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కేజీఎఫ్ ఛాప్టర్ 2 కు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.
కర్నాటక – రూ. 175.15 కోట్లు
ఏపీ + నైజాం – రూ. 134.10 కోట్లు
తమిళనాడు – రూ. 104 కోట్లు
కేరళ – రూ. 62.45 కోట్లు
నార్త్ బెల్ట్ – రూ. 490.30 కోట్లు
ఓవర్సీస్ – రూ. 178.25 కోట్లు