యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ ఛాప్టర్-2 సినిమా రికార్డ్ సృష్టించింది. నిన్నటితో వారం రోజుల రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఈ 7 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఓ డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. షేర్ పరంగా చూసుకుంటే.. ఈ సినిమాకు ఏపీ,నైజాంలో 64 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వచ్చింది.
ఇక వరల్డ్ వైడ్ చూసుకుంటే ఈ సినిమా 680 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. మరో వారం రోజుల్లో ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరడం గ్యారెంటీ. ఎందుకంటే, తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలో ఎక్కడా ఈ సినిమాకు వసూళ్లు తగ్గలేదు. కాస్త ఆక్యుపెన్సీ తగ్గినప్పటికీ, వసూళ్లు మాత్రం స్టడీగా వస్తున్నాయి.
కేరళ, కర్నాటక, యూఎస్, నైజాం, తమిళనాడు.. ఇలా చాలా ఏరియాల్లో కేజీఎఫ్ ఛాప్టర్-2 సినిమాకు నిలకడగా వసూళ్లు వస్తున్నాయి. ఏపీ, నైజాంలో ఈ వారం రోజుల్లో కేజీఎఫ్ ఛాప్టర్-2 కు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి
నైజాం – 33.43 కోట్లు
సీడెడ్ – 9.07 కోట్లు
ఉత్తరాంధ్ర – 5.92 కోట్లు
ఈస్ట్ – 4.40 కోట్లు
వెస్ట్ – 2.73 కోట్లు
గుంటూరు – 3.58 కోట్లు
కృష్ణా – 3.23 కోట్లు
నెల్లూరు – 2.15 కోట్లు