అనుకున్నదే జరిగింది. అంచనాలు నిజమయ్యాయి. కేజీఎఫ్-2 బ్లాక్ బస్టర్ హిట్టయింది. మొదటి రోజు మొదటి ఆటకే ఈ టాక్ వచ్చేసింది. ఇక మొదటి రోజు వసూళ్లతో ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఈ సినిమా ఆర్ఆర్ఆర్ ను క్రాస్ చేస్తుందని అంతా అంచనా కట్టారు. అంచనాలకు తగ్గట్టే ఉత్తరాదిన కేజీఎఫ్-2 రికార్డులు తిరగరాసింది. అంచనాల్ని మంచి వసూళ్లు రాబట్టింది. ఇంకా చెప్పాలంటే.. ఆర్ఆర్ఆర్ కు 3 రెట్లు వసూళ్లు చూపెట్టింది.
నార్త్ లో ఆర్ఆర్ఆర్ సినిమాకు మొదటి రోజు 20 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. కేజీఎఫ్-2 సినిమా దాన్ని క్రాస్ చేసింది. ఏకంగా 61 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఉత్తరాదిన ఇదో పెద్ద రికార్డ్. ఇక కేరళలో ఆల్ టైమ్ హిట్ అయింది ఈ సినిమా. మొదటి రోజు అత్యథిక వసూళ్లు సాధించిన సినిమాగా మోహన్ లాల్ నటించిన ఒడియన్ నిలవగా… ఆ రికార్డ్ ను కేజీఎఫ్-2 క్రాస్ చేసింది. ఇక కన్నడనాట ఈ సినిమా ఎపిక్ మూవీగా నిలిచింది. ఎవ్వరికీ అందని స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది.
అటు ఓవర్సీస్ లో విడుదలన మొదటి రోజే మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది కేజీఎఫ్-2 సినిమా. ఓవరాల్ గా ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 134.5 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. నార్త్ లో ఈ సినిమా 2 రోజుల్లో వంద కోట్ల క్లబ్ లోకి వెళ్లే అవకాశం ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డ్ సృష్టించింది. ఏపీ,నైజాంలో 19 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. నైజాంలో ఏకంగా మొదటి రోజు 9.68 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఓ డబ్బింగ్ సినిమాకు నైజాంలో ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇదే తొలిసారి. తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్-2కు మొదటి రోజు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.
నైజాం – రూ. 9.68 కోట్లు
సీడెడ్ – రూ. 2.84 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.70 కోట్లు
ఈస్ట్ – రూ. 1.19 కోట్లు
వెస్ట్ – రూ. 84 లక్షలు
గుంటూరు – రూ. 1.13 కోట్లు
కృష్ణా – రూ. 90 లక్షలు
నెల్లూరు – రూ. 81 లక్షలు