ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 మరో రికార్డ్ సృష్టించింది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ హిందీ చిత్రంగా నిలిచింది. ఈద్ (మంగళవారం) రోజున సినీ ప్రేక్షకులకు ఈ చిత్రం ఫస్ట్ ఆప్షన్ గా మారింది. వసూళ్లు మరోసారి పోటెత్తాయి. నిన్న బుధవారం కూడా ఈ సినిమాకు వసూళ్లు స్టడీగా ఉన్నాయి.
ఈద్ ఇచ్చిన ఉత్సాహంతో, బుధవారం నాటి వసూళ్లతో కలుపుకొని కేజీఎఫ్ ఛాప్ట్ 2 సినిమా.. అమీర్ ఖాన్ నటించిన దంగల్ లైఫ్ టైమ్ వసూళ్లను దాటేసింది. అలా ఆల్ టైమ్ బాలీవడ్ హిట్ సినిమాల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం లిస్ట్ లో మొదటి స్థానంలో బాహుబలి-2, రెండో స్థానంలో కేజీఎఫ్ 2 ఉన్నాయి. ఇలా బాలీవుడ్ టాప్ లిస్ట్ లో రెండు సౌత్ సినిమాలు నిలవడం ఆశ్చర్యమే. సల్మాన్, అమీర్, షారూక్ సినిమాలేవీ.. ఈ ఘనత అందుకోలేకపోయాయి. మరోవైపు, “కెజిఎఫ్ 2” నైజాంలో ఆల్ టైమ్ హిట్స్ లో మూడో స్థానంలో నిలిచింది.
ఈరోజు లేదా రేపు ఈ సినిమా నార్త్ లో మరో ఘనమైన రికార్డ్ సొంతం చేసుకోబోతోంది. ప్రస్తుతం కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ కు 383 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఈరోజు లేదా రేపు ఈ సినిమా 400 కోట్ల క్లబ్ లోకి చేరబోతోంది.
కేజీఎఫ్ ఛాప్టర్-2 దెబ్బకు హిందీ సినిమాలన్నీ కుదేలయ్యాయి. జెర్సీ సినిమా ఫ్లాప్ అవ్వగా, అజయ్ దేవగన్ నటించిన రన్ వే 34 సినిమా నిలబడలేకపోయింది. మరో 3 సినిమాల్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే 20 రోజుల రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, మరో 10 రోజుల పాటు నార్త్ బెల్ట్ లో తన హవా చూపించే అవకాశం ఉంది.