ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాక్ స్టార్ యశ్ నటించిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా సినిమాగా విడుదలై.. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్ 2’ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ.. తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే, తాజాగా ‘కేజీఎఫ్ 2’ ఓటీటీ విడుదలకు డేట్ ఖరారైందని సోషల్ మీడియాల్లో వార్తలు చక్కర్లు కొడుతోన్నాయి. థియేటర్లలో విడుదలైన 4 వారాల్లోనే అంటే మే 13న ఓటీటీలోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, దీనికి సంబంధించి ‘కేజీఎఫ్ 2’ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా, ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న ఈ సినిమా అప్పుడే ఓటిటిలో విడుదల చేయబోరని యష్ అభిమానులు అంటున్నారు.
ఇక ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. హోంబెల్ ఫిలింస్‌పై విజయ్ కిరగందూర్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈసినిమాలో హిందీ బడా హీరో సంజయ్ దత్ అథీరా పాత్రలో నటించా.. మరోవైపు ప్రధాన మంత్రి పాత్రలో రవీనా టాండన్ పవర్‌ఫుల్ రోల్ ప్లే చేశారు. ఇక, రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించారు.