అంతా కేజీఎఫ్2 కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా రిలీజైన ట్రయిలర్ కు వచ్చిన వ్యూస్ చూస్తే, ఈ సినిమా కోసం అంతా ఎంతలా ఎదురుచూస్తున్నారో అర్థం అవుతుంది. ఆ అంచనాలకు తగ్గట్టే మేకర్స్ కూడా ప్రమోషన్ స్పీడ్ పెంచారు. రీసెంట్ గా యష్ ముంబయిలో సందడి చేశాడు. త్వరలోనే వివిధ నగరాల్లో భారీ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఇవన్నీ కామన్. ఏ పెద్ద సినిమాకైనా జరిగేవే. ఇంతకంటే కొత్తగా ఏం చేయాలి, సినిమాకు మరింత బజ్ తీసుకురావాలంటే ఇంకేం కావాలి. సరిగ్గా ఇక్కడే వినూత్నంగా ఆలోచించారు కేజీఎఫ్ మేకర్స్. కేజీఎఫ్ పార్ట్-2 విడుదలకు సరిగ్గా కొన్ని రోజుల ముందు కేజీఎఫ్ పార్ట్-1ను మరోసారి థియేటర్లలోకి తీసుకొచ్చారు.
అవును.. ఈ వీకెండ్ కేజీఎఫ్ ఛాప్టర్ 1 విడుదలవుతోంది. అది రిలీజైన వారం రోజులకే ఛాప్టర్-2ను విడుదల చేయబోతున్నారు. ఇలా ఫస్ట్ పార్ట్ తో సెకెండ్ పార్ట్ పై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. నిజంగా ఇది మంచి ఎత్తుగడ.
ఛాప్టర్-1కు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అందులో రాకీ భాయ్ పాత్ర అంటే చాలామందికి చాలా ఇష్టం. క్లైమాక్స్ అయితే అదుర్స్. ఆ సినిమాను ఇప్పటికే పదేపదే అమెజాన్ లో చూస్తుంటారు. ఇప్పుడు అదే సినిమాను బిగ్ స్క్రీన్ పై చూసి, ఆ వెంటనే ఛాప్టర్-2ను కూడా బిగ్ స్క్రీన్ పై చూడాలని తహతహలాడేవాళ్లు చాలామంది ఉన్నారు. అందుకే ఈ రీ-రిలీజ్.