బాహుబలి తర్వాత పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ కొట్టిన సౌత్ సినిమా కేజీఎఫ్. కన్నడ స్టార్ యశ్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్‌హిట్‌గా నిలిచింది. కేజీఎఫ్ కు సీక్వెల్ గా కేజీఎఫ్ చాప్టర్-2 తెరకెక్కుతుండగా… సినిమాపై భారీ అంచనాలున్నాయి. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ ట్రైలర్ కు ముహుర్తం ఫిక్స్ అయ్యింది.
ఈ నెల 8న యశ్ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేయనున్నారు. జనవరి 8న ఉదయం 10.18నిమిషాలకు టీజర్ రిలీజ్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇక నుండి వరుసగా సినిమా అప్డేట్స్ రిలీజ్ చేస్తూ… సమ్మర్ లో సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు.