కే జి ఎఫ్… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కే జి ఎఫ్. ఎటువంటి అంచనాలు లేకుండా 2018 లో రిలీజ్ అయిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. రవి బసృర్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా కే జి ఎఫ్ చాప్టర్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది.
ఇక కథ విషయానికొస్తే పార్ట్ వన్ లో గరుడ ని చంపేసిన రాఖీ బాయ్ కే జి ఎఫ్ ను ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత కే జి ఎఫ్ 2 స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉన్న ప్రజలను సైన్యంగా చేసుకుంటాడు రాఖీ భాయ్. గరుడ లేడన్న విషయం తెలుసుకున్న అధీరా మళ్లీ కేజీఎఫ్ కోసం అడుగు పెడతాడు. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి యాక్షన్ నడిచింది, అధీరా ఇక్కడికి రావడానికి అసలు కారణం ఎవరు? పీఎం గా ఉన్న రవీనాటాండన్ కేజిఎఫ్ విషయంలో ఎలాంటి ప్లానింగ్ చేసింది అసలు కే జి ఎఫ్ లో ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ చూసుకుంటే యశ్ ఎంట్రీ వేరే లెవెల్ లో ఉంటుంది. నటన, డైలాగ్ డెలివరీ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సంజయ్ దత్ క్యారెక్టర్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అలాగే శ్రీనిధి శెట్టి, టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇలా వారి వారి పాత్రలకు న్యాయం చేస్తూ అద్భుతంగా నటించారు. అలాగే ప్రశాంత్ నీల్ గురించి కూడా చెప్పుకోవాలి. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్ తో ప్రేక్షకులకు ఉత్కంఠ రేపే సీన్స్ తో కేజీఎఫ్ ను మించి పోయే విధంగా చూపించాడు. అలాగే ఎమోషన్స్ ని కూడా అద్భుతంగా చూపించాడు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సినిమాకు హైలెట్ గా చూపించాడు.
ఇక మైనస్ పాయింట్స్ చూసుకుంటే కథ అక్కడక్కడ నెమ్మదిగా వెళుతున్నట్లు అనిపిస్తుంది. అలాగే ఎలివేషన్ సీన్స్ కూడా కాస్త ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. ఉన్న కథని సాగదీస్తూ చూపిస్తున్నారా అనే ఒక సందేహం కలుగుతుంది.
ఇకపోతే రవి బసృర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అనే చెప్పాలి. సినిమాకు ఇది పెద్ద హైలెట్. అలాగే ప్రకాష్ రాజు బ్యాగ్రౌండ్ వాయిస్ కూడా సరిగ్గా సూట్ అయింది. భువన్ గౌడ్ సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. మొత్తంగా చాప్టర్ 1 కు మించి అంచనాలతో వచ్చిన చాప్టర్ 2 అదిరిపోయిందనే చెప్పాలి. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.