విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయం సాధించి, ఇటు కలెక్షన్లను కొల్లగొట్టిన సినిమా కేజీఎఫ్. దీంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ పై టాలీవుడ్ మాత్రమే కాదు అన్నీ భాషల్లోనూ హీరోలందరి చూపు పడింది. అయితే ప్రస్తుతం కేజీఎఫ్- చాఫ్టర్ పై ఫోకస్ పెట్టిన ప్రశాంత్, ఇటు తెలుగులో మహేష్, ఎన్టీఆర్ ను కలవటం చర్చనీయాంశం అయ్యింది.
ఓవైపు కేజీఎఫ్-2 చేస్తూనే ఎన్టీఆర్ తో జతకట్టబోతున్నారని, మహేష్ కూడా ఉత్సాహాంగా ఉన్నారంటూ రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే… కేజీఎఫ్-2 స్క్రిప్ట్, సినిమా పూర్తయ్యే వరకు ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి దర్శకుడు సిద్దంగా లేనట్లు తెలుస్తోంది.
కేజీఎఫ్ సక్సెస్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ అడ్వాన్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చినా ప్రశాంత్ నీల్ సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. దీంతో కేజీఎఫ్- 2 తర్వాత ఎవరితో సినిమా చేస్తారన్నది ఇంకొన్నాళ్లు సస్పెన్స్ గానే మిగిలనుంది.
అయితే, కేజీఎఫ్ స్థాయిలో సీక్వెల్ ను కూడా తెరకెక్కించగలిగితే బాలీవుడ్ స్థాయిలో సినిమా ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. అందుకే దర్శకుడు ఇప్పుడే టాలీవుడ్ పెద్ద స్టార్స్ ఆఫర్ ఇచ్చినా వెనుకడుగు వేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.