జక్కన్న రాజమౌళి RRR షూటింగ్‌లో ఉన్న నందమూరి హీరో ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో జతకట్టబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పటి నుండి అనేది ఇంకా క్లారిటీ రానప్పటికీ… తన 30వ చిత్రం త్రివిక్రమ్‌తో చేసేందుకు ఇప్పటికే ఎన్టీఆర్ అంగీకరించారు. దీంతో త్రివిక్రమ్ కథను, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.
త్రివిక్రమ్ తరువాత ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు పలువురు టాప్ డైరెక్టర్స్ ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవితో సినిమా చేస్తున్న డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటుండగా…. ఈ లిస్ట్‌లో మరో డైరెక్టర్ చేరిపోయాడు. కేజీఎఫ్‌తో సంచలన విజయం నమోదు చేసిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎన్టీఆర్ ఇంకా ఏటూ తేల్చుకోలేదని తెలుస్తోంది. ఫస్ట్ త్రివిక్రమ్‌తో సినిమా మొదలయ్యాక నెక్ట్స్ సినిమా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.