ఒక్క సినిమా తో యూత్ లో సూపర్ స్టార్ అయ్యాడు హీరో యశ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదల అయిన అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. సీక్వెల్ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, రవీనా టాండన్ లతో పాటు రావు రమేష్ కూడా నటిస్తున్నారు.
అయితే కేజీఎఫ్ చిత్రం శాటిలైట్ రైట్స్‌కి సంబంధించిన ప్రస్తుతం చర్చలు జరుగుతున్న సమయంలో తెలుగు లోకల్ ఛానెల్ ఈ చిత్రాన్ని ప్రసారం చేయడం పై మండిపడ్డారు కేజియఫ్ నిర్మాత కార్తీక్ గౌడ. ఒక తెలుగు లోకల్ ఛానెల్ కేజీఎఫ్ చిత్రాన్ని అక్రమంగా ప్రసారం చేసింది . వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఇలాంటి నీచమైన సంస్కృతి లోకల్ చానెల్స్‌లో ఉందని.. శాటిలైట్ రైట్స్‌పై, డిజటల్ హక్కులపై వారికి కనీస గౌరవం కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.