కేజీఎఫ్ సినిమాకు పనిచేసిన వారంతా రాత్రికి రాత్రే స్టార్స్ గా మారిపోయారు. ప్రస్తుతం అదే క్రూ కేజీఎఫ్-2, సలార్ మూవీలకు కూడా పనిచేస్తుంది. ఇందులో ఫైట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా… ఫైట్ కంపోజర్స్ అంబు-అర్విలకు మరో ఛాన్స్ వచ్చింది. మాస్ మహారాజ రవితేజ నటించనున్న ఖిలాడీ మూవీకి పనిచేయనున్నారు.
నిజానికి ఈ మూవీ కోసం రామ్-లక్ష్మణ్ ను తీసుకున్నారు. కానీ సడన్ గా కేజీఎఫ్ స్టంట్ మాస్టర్స్ తెరపైకి వచ్చారు. ఈ సినిమాలో ఓ జైలులో సీన్స్ కోసం ప్రత్యేకంగా సెట్ వేశారు. ఇక్కడ ఫైట్స్ సినిమాకే హైలెట్ గా ఉంటాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో… కేజీఎఫ్ ఫైట్ మాస్టర్స్ రావటం ఆసక్తిరేపుతోంది.
కిలాడీ మూవీలో రవితేజ డబుల్ రోల్ ప్లే చేయనుండగా… డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.