ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యష్ హీరోగా 2018 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ కేజిఎఫ్. ఈ సినిమాకు సీక్వెల్ గా ఇటీవల కే జి ఎఫ్ చాప్టర్ 2 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కూడా మంచి సక్సెస్ ను సాధించింది. ఇందులో రవీనాటాండన్, సంజయ్ దత్, కీలక పాత్రలో నటించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. రవి బసృర్ సంగీతం అందించారు. అయితే కే జి ఎఫ్ పార్ట్ వన్, పార్ట్ 2 సక్సెస్ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కీలకమనే చెప్పాలి.
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు హీరోయిన్ సౌందర్య చివరిగా మాట్లాడిన మాటలు అవేనా ?
ఇదిలా ఉండగా ఒక చిన్న అబ్బాయి రాఖీ భాయ్ గా మారి తన తల్లికి ఇచ్చిన మాట కోసం ఎలాంటి కష్టాన్ని ఫేస్ చేశాడు, ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనేది చాలా చక్కగా చూపించాడు ప్రశాంత్ నీల్. అలాగే యష్ చిన్నప్పటి పాత్రలో ఓ కుర్రాడు సినిమాలో అద్భుతంగా నటించాడు.
మహేష్ బాబు అక్క… బాలయ్య తో మిస్ చేసుకున్న సినిమా ఏదో తెలుసా ?
సినిమా గురించి మాట్లాడే వారు కచ్చితంగా ఈ పాత్ర గురించి మాట్లాడుకోవాలి. ఆ పాత్ర చేసింది పద్దెనిమిదేళ్ల అన్మోల్ అనే కుర్రాడు. చిన్నప్పటి పాత్రలో ఆ అబ్బాయి చక్కగా నటించాడు. అన్మోల్ కు మాములుగా స్టంట్స్ అలాగే డ్యాన్స్ అంటే చాలా ఇష్టమట. వాటికి సంబంధించిన వీడియోలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. పడక అనే సినిమాలో కూడా నటించాడు అన్మోల్.
నటుడు సునీల్ ఫ్యామిలిని ఎప్పుడైనా చూసారా ? వైఫ్ ఎవరో తెలుసా ?
ఎన్నో రకాలుగా ఆలోచించి ప్రశాంత్ నీల్ అన్మోల్ ను సెలెక్ట్ చేశారట. ఒక రకంగా చెప్పాలంటే సినిమాకు కీలక పాత్ర అన్మోల్ దనే చెప్పాలి. జూనియర్ రాఖీ షాట్ ల కోసం 12 నెలలు పట్టిందట.