ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం కేజిఎఫ్. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో కొత్తగా చెప్పనవసరం లేదు. వసూళ్లను కూడా అదే స్థాయిలో రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా చాప్టర్2 ను తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఫైట్ మాస్టర్ అన్బు, అరివు నేతృత్వంలో యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు.
ఇక రాఖీ భాయ్ గా కన్నడ స్టార్ యష్ నటిస్తుండగా అధీరాగ బాలీవుడ్ స్టార్ నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ పై ఓ క్లారిటీ రానుంది. హోంబలే ఫిల్మ్ బ్యానర్ పై విజయ్ కరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Climax it is !!!!
Rocky ⚔ Adheera
With the deadly fight masters anbariv…..#KGFCHAPTER2 pic.twitter.com/QiltJiGQgl— Prashanth Neel (@prashanth_neel) December 7, 2020