ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కెజిఎఫ్. ఎటు వంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయినా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా పార్టు2 తెరకెక్కుతుంది.
ఏప్రిల్ 14 న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాలతో వాయిదా పడింది. ఇక చాలా రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ దేశ వ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
మార్చి 8న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక నిజం అయితే ఈ ట్రైలర్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మించారు. ఇక ఇందులో బాలీవుడ్ స్టార్స్ రవీనా టాండన్, సంజయ్ దత్ లు కీలక పాత్రల్లో నటించారు.