గణేష్ పండగ వస్తుందనగానే తెలుగు రాష్ట్రలో మొదటగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి. తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద విగ్రహంగా ఖైరతాబాద్ గణపతి విగ్రహాన్ని తయారుచేస్తుంటారు. అయితే గణేష్ పండగకి ముందుగానే చాలా రోజులు ముందు నుంచే విగ్రహ తయారీ పనులు చేపడుతారు. విగ్రహ తయారీ ప్రారంభంలో తొలి ఘట్టమైన కర్రపూజను మే 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు చేపడుతున్నట్లు గణేష్ ఉత్సవ్ కమిటీ తెలిపింది.
అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీంతో ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఖైరతాబాద్ గణేషున్ని ఈ సారి కేవలం ఒకే ఫీట్ ఎత్తుతో తయారు చేయాలని నిర్ణయించింది. ఒక్కో సంవత్సరం ఒక్కో ఫీట్ పెంచుకుంటూ పోతూ భారీ వినాయక విగ్రహం పెట్టే ఆచారం పాటించే ఉత్సవ సమితి, ఈ సారి మాత్రం కరోనా కల్లోలం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.