హైదరాబాద్: గణేశ నవరాత్రులు తుది అంకానికి చేరుకున్నాయి. ఘనంగా పూజలందుకున్నవినాయకుడు.. నిమజ్జనానికి బయల్దేరాడు. చివరి పూజలందుకున్న ఖైరతాబాద్ శ్రీద్వాదశాదిత్య మహాగణపతిని భారీ క్రేన్ సాయంతో ట్రక్కుపైకి ఎక్కించారు. భారీ గణపతి శోభాయాత్ర ప్రారంభం కావడంతో స్వామివారిని దర్శంచుకోవడానికి రోడ్డుకు రెండు వైపులా భక్తులు నిలుచుని స్వాగతం పలుకుతున్నారు. హైదరాబాద్‌లో మొదట నిమజ్జనం జరిగేది ఖైరతాబాద్ మహా గణపతేనని నిర్వాహకులు చెబుతున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 6 దగ్గర ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం జరుగుతుంది. ఖైరతాబాద్ శ్రీద్వాదశాదిత్య మహాగణపతిని అన్నింటికంటే ముందే నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మహా గణపతిని సంపూర్ణంగా నిమజ్జనం చేసేందుకు క్రేన్ నెంబర్ 6 దగ్గర 20 ఫీట్లకు పైగా నీరు లోతు పెంచారు.