వినాయకచవితి అంటేనే గుర్తొచ్చేది అత్యంత ఎత్తైన ఖైరతాబాద్ వినాయకుడు . అంగరంగ వైభవంగా నవరాత్రులు నిర్వహిస్తారు. కానీ ఈసారి కరోనా ప్రభావం ఖైరతాబాద్ వినాయకుడికి తగిలింది . రకరకాల ప్రశ్నలు , ఊహాగానాలు లేవనెత్తుతున్నారు.కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఎత్తు తగ్గించే ఆలోచన చేస్తున్నారు ప్రచారం జరుగుతోంది . కేవలం ఒక్క ఫీట్ గణేషుడే ఈసారి దర్శనమిస్తాడని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రకటన కూడా చేసింది .
దీనిపై భాగ్యనగర ఉత్సవ కమిటీ భగ్గుమంది . పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని , బలవంతంగా గణేష్ ఉత్సవ కమిటీలపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు . రంజాన్ సందర్బంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉన్న దగ్గర , వాళ్ళని అడ్డుకోకుండా గణేష్ ఉత్సవాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని భాగ్యనగర ఉత్సవ కమిటి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు తెలిపారు .
ఆగస్టు చివరలో జరిగే ఉత్సవాల గురించి ఇప్పుడెందుకు అంత తొందర అని పోలీసులును ప్రశ్నించారు . ఎట్టి పరిస్థితుల్లో గణేష్ ఉత్సవాలు పోయిన ఏడాది లాగే జరిగి తీరుతాయని స్పష్టం చేశారు . పరిస్థితులను బట్టి, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిచకుండా ఉత్సవాలు నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు .