మాస్ మహారాజా రవితేజ లాంగ్ గ్యాప్ తర్వాత క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే మరోవైపు ఖిలాడి సినిమా కూడా రవితేజ చేస్తున్నాడు. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో ఇటీవల రవితేజ జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు.
ఇక ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి లు నటిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి జనవరి 26న ఓ అప్డేట్ రాబోతోంది. ఉదయం 10 గంటల 8నిమిషాలకు ఆ అప్డేట్ వస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించారు. అయితే మాస్ మహారాజా అభిమానులు ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నారు.