ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రణరంగమైంది. రైతులకు కమిషన్ దారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో వివాదం చోటుచేసుకుంది. మిర్చిని అమ్ముకోవడానికి వచ్చిన రైతులను కమిషన్ దారులు అడ్డుకున్నారు. దీంతో మిర్చి అమ్మడాన్ని ఎందుకు అడ్డకుంటున్నారు అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా పొట్ట కొట్టకండి.. అంటూ రైతులు వాపోయారు. అయితే కమిషన్ దారులు ససేమిరా అన్నారు. మిర్చి అమ్మడం ఆపివేయాలని కోరారు. దీంతో అడ్డుకున్న కమిషన్ దారులపై రైతు కుటుంబం దాడికి దిగింది. ఈ నేపథ్యంలో.. రైతులపై కమిషన్ దారులు దాడికి పాల్పడ్డారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రణరంగమైంది.
రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మేము న్యాయంగా ఉంటే.. కమిషన్ దారులు ఇలా అడ్డుకోవడం తగదంటూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో రైతులకు గాయాలు కాగా.. ఈ ఘటనలో కమిషన్ దారులకు చొక్కాలు చిరిగాయి. ఇక స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులను అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఖమ్మం రూరల్ మండలం తీర్ధాల గ్రామానికి చెందిన రైతులు కమిషన్ దారుకు అమ్ముకోవడం జరిగింది. అంతకుముందు కమిషన్ దారు దగ్గర తీసుకున్న అప్పు చెల్లించకుండా.. ఈ సారి మరో కమిషన్ దారుకు మిర్చి అమ్మడానికి సిద్ధం కావడంతో గొడవ మొదలైంది. మార్కెట్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులను అదుపులోకి తీసుకున్నారు.