అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి తీరు ఒకేలా తయారయ్యింది. తాజాగా ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల క్యాంప్ ఆఫీస్ లో టీఆరెస్ లో వర్గపోరు చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో ఆ పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
దీనితో కార్యకర్తలు ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు దిగారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ నూతన కమిటీలు మరియు అనుబంధ సంఘాల కమిటీలను ప్రకటింటిచే సమయంలో ఈ వివాదం స్టార్ట్ అయింది. మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వచ్చింది.