అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ తో పాటు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. తాను ప్రేమిస్తున్న అమ్మాయిని తన మిత్రుడు నవీన్ కూడా ప్రేమించడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన నిందితుడు హరిహర..అత్యంత దారుణంగా అతని మర్డర్ కు స్కెచ్ వేశాడు. ఇక ట్విస్ట్ విషయానికొస్తే..ఈ మర్డర్ కు అమ్మాయి దగ్గర నుంచి వచ్చిన రిప్లే.. ‘గుడ్ బాయ్’ అని.
నవీన్ ని మర్డర్ చేయగానే..హరిహర ఈ విషయాన్ని అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాడు. అంతే కాదు మెసేజ్ లో కూడా నవీన్ హత్య విషయాన్ని తెలియజేశాడు. ఆ తర్వాత ఒక్కో భాగం కోస్తూ..ఆమెకు ఫోటోలు పంపాడు. ‘ఈ వేలే కదా నిన్ను తాకింది.. ఇదిగో వేలు’ అంటూ నవీన్ వేలు కోసి ఆ ఫోటోని అమ్మాయికి పంపించాడు. తరువాత ‘ఈ పెదాలే కదా నిన్ను తాకింది..’ అంటూ పెదాలు కోసి ఆ ఫోటో మెసేజ్ చేశాడు.
‘ఈ గుండె కదా నిన్ను తాకింది..’ అంటూ గుండెను కోసి, ఆ పిక్ ను అమ్మాయి ఫోన్ కు పంపాడు. చివరకు నవీన్ తలని కోసి, దూరంగా వేశాడు. ఇలా ఒక్కో భాగం కోస్తూ..చాలా దారుణంగా మెసేజ్ లు అమ్మాయికి పంపినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ మెసేజ్ లన్నింటికి ఆ అమ్మాయి ఏమాత్రం భయపడకుండా… సింపుల్ గా’ అవునా..ఓకే వెరీ గుడ్ బాయ్’ అంటూ రిప్లే ఇచ్చింది.
దీంతో ఆ అమ్మాయిపై అనుమానంతో ఆమెను నిందితురాలిగా చేర్చబోతున్నారు పోలీసులు. నవీన్ హత్యలో అమ్మాయి హస్తం కూడా ఉందా.. లేదా అనే కోణంపై విచారిస్తున్నారు. మరోవైపు హరిహర కృష్ణ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, అతడు సైకో అని తెలుస్తోంది. అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నట్టు తెలిసింది. దీంతో అతడు నవీన్ మర్డర్ కు ముందు నుంచే ప్లాన్ వేస్తున్నట్టు విచారణలో తేలింది.
ఇక వివరాల్లోకి వెళితే.. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదువుతున్న నవీన్ ,హరిహరలు అక్కడే చదువుతోన్న ఓ యువతిని ప్రేమిస్తున్నారు. దీంతో ఎలాగైనా ఆ యువతిని దక్కించుకోవాలని పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో హరిహర తాను ప్రేమిస్తున్న ప్రేయసీ ఎక్కడ నవీన్ కు దగ్గరవుతుందేమోనని.. భయ పడ్డాడు.
దీంతో ఎలాగైనా..నవీన్ ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు. పార్టీ చేసుకుందామని నవీన్ ను నమ్మించి హైదరాబాద్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి.. తాగించి..అత్యంత దారుణంగా హతమార్చాడు. అబ్దుల్లా పూర్ మెట్ గుట్టల్లో అతడి మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు. అయితే నాలుగు రోజులైనా కళాశాలకు, ఇంటికి నవీన్ రాకపోవడంతో ఈ నెల 22న అతని తండ్రి శంకరయ్య నార్కట్ పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసుల నుంచి ఒత్తిడి పెరగడంతో హరిహర అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఇక పోలీసుల విచారణలో హరిహరే నవీన్ ను చంపినట్టుగా తేలింది. దీంతో అబ్దుల్లాపూర్ మెట్ గుట్టల్లోంచి నవీన్ డెడ్ బాడీని రికవర్ చేసిన పోలీసులు పోస్ట్ మార్టం కోసం తరలించారు. అయితే తాను ప్రేమించిన యువతిని నవీన్ కూడా ప్రేమించడంతోనే అతడిని హత్య చేసినట్టుగా హరిహర పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఇక ఈ మర్డర్ లో ఆ అమ్మాయి ఇచ్చిన ట్విస్ట్ తోనే పోలీసులు ఆమెను కూడా విచారిస్తున్నారు.