విడుదలైన మొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చేసింది. సినిమా యావరేజ్ అవుతుందని కొందరు, ఫ్లాప్ అవుతుందని మరికొందరు వాదించుకోవడం కనిపించింది. ఆ అంచనాలే నిజమయ్యాయి. వసూళ్ల పరంగా ఖిలాడీ సినిమా నిరాశపరిచింది. తాజాగా వారం రోజుల రన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ, ఇప్పటివరకు బ్రేక్ ఈవెన్ అవ్వలేదు.
రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది ఖిలాడీ. వరల్డ్ వైడ్ ఈ సినిమాను 24 కోట్ల రూపాయలకు అమ్మారు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 25 కోట్ల రూపాయలు రావాలి. మొదటి వారమే అటుఇటుగా 19-20 కోట్ల రూపాయలు రావాలి. ఈ విషయంలో ఖిలాడీ ఫెయిల్ అయింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి వారం (7 రోజుల్లో) 10 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. వరల్డ్ వైడ్ చూసుకుంటే 12 కోట్ల 20 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపు కష్టమనే అభిప్రాయానికి ట్రేడ్ వచ్చేసింది.
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ రాబట్టిన ఈ సినిమా, 7వ రోజు వచ్చేసరికి 42 లక్షల రూపాయల షేర్ కు పడిపోయింది. తెలుగు రాష్టాల్లో ఖిలాడీ సినిమాకు ఈ వారం రోజుల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.
నైజాం – 3.79 కోట్లు
సీడెడ్ – 1.67 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.42 కోట్లు
ఈస్ట్ – 74 లక్షలు
వెస్ట్ – 61 లక్షలు
నెల్లూరు – 50 లక్షలు
గుంటూరు – 1.03 కోట్లు
కృష్ణా – 57 లక్షలు