రవితేజ హీరోగా నటించిన సినిమా ఖిలాడీ. రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చేసింది. బజ్ వల్ల మొదటి రోజు భారీగా వసూళ్లు వచ్చినప్పటికీ రెండో రోజు నుంచి ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గిపోయాయి. మరీ ముఖ్యంగా డీజే టిల్లుకు హిట్ టాక్ రావడంతో, నిన్న ఆదివారం ఖిలాడీ ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయింది. ఫలితంగా విడుదలైన ఈ 3 రోజుల్లో ఖిలాడీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల 76 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది.
నైజాంలో ఈ సినిమా 8 కోట్ల రూపాయలు ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఆంధ్రా-సీడెడ్ కలిపి 13 కోట్లకు అటుఇటుగా (అడ్వాన్సులతో కలిపి) బిజినెస్ చేసింది. ఇక ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా కలుపుకొని ఈ సినిమాను 24 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్మారు. సో.. ఖిలాడీ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 25 కోట్ల 50 లక్షల రూపాయలు రాబట్టాలి. ఎట్ లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా 22 కోట్ల రూపాయల వసూళ్లు రావాలి. అంటే ఇంకా 14 కోట్ల 24 లక్షల రూపాయలు కావాలి.
ఈ టాక్ తో ఖిలాడీ సినిమాకు 14 కోట్ల రూపాయల వసూళ్లు వస్తాయా అనేది అనుమానంగా మారింది. అటు ఓవర్సీస్, హిందీలో కూడా ఈ సినిమాకు ఏమంత పెద్ద రెస్పాన్స్ రాలేదు. మరో 2 వారాల్లో ఈ సినిమా ఫైనల్ రన్ ముగిసేలా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ (మొదటి 3 రోజులు) వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి
నైజాం – రూ. 3.05 కోట్లు
సీడెడ్ – రూ. 1.17 కోట్లు
ఉత్తరాంధ్ర – 99 లక్షలు
ఈస్ట్ – 53 లక్షలు
వెస్ట్ – 44 లక్షలు
గుంటూరు – 82 లక్షలు
నెల్లూరు – 37 లక్షలు
కృష్ణా – 39 లక్షలు