మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ఖిలాడి. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి లు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మించారు. అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శుక్రవారం రిలీజైన ఈ చిత్రంకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.
ఇక కలెక్షన్ల పరంగా చూసుకుంటే మొదటి రోజు ఖిలాడి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఐదు నుంచి ఆరు కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ వీకెండ్ మొత్తం ఇలాగే కొనసాగితే కిలాడీ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది. ఇకపోతే ఖిలాడి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కి సంబంధించి అధికారిక లెక్కలు తెలియాల్సి ఉంది.
ఇక వీటితో పాటు రవితేజ ధమాకా. రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర,టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో నటిస్తున్నాడు.