మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అందులో రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు.
మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈచిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 11న రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఇదిలా ఉండగా సంక్రాంతి కానుక ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో ఐరన్ రాడ్ తో రవితేజ స్టైలిష్ లుక్ లో కనిపించాడు.
ఇక ఈ సినిమాతో పాటు రవితేజ ధమాకా, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ చిత్రాలలో నటిస్తున్నాడు.