రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఖిలాడి. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
మరోవైపు శనివారం డిజె టిల్లు సినిమా రిలీజ్ అయింది. ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఖిలాడి కలెక్షన్లు మరింత తగ్గిపోయాయి. రెండురోజుల కు గాను చూసుకుంటే… నైజాంలో రూ. 2.64కోట్లు, సీడెడ్‌లో రూ. 89 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 75 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 40 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 33 లక్షలు, గుంటూరులో రూ. 67 లక్షలు రాబట్టింది.
అలాగే కృష్ణాలో రూ. 28 లక్షలు, నెల్లూరులో రూ. 29 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 6.25 కోట్లు షేర్ వచ్చింది. ఇక వరల్డ్ వైడ్ గా కర్ణాటక ఓవర్సీస్ వసూళ్లను కలుపుకొని 7.03కోట్ల షేర్ రాబట్టింది.
మొత్తం 12కోట్లు గ్రాస్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.