క్రాక్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రవితేజ నుంచి వస్తున్న సినిమా ఖిలాడీ. అందుకే ఈ మూవీపై బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. సాధారణంగా రవితేజ సినిమాకు ఎంత బిజినెస్ జరుగుతుందో, అంతకంటే 50శాతం ఎక్కువే ఈ సినిమాకు ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ఈ మేరకు సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనేది డౌట్.
ప్రీ-రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. నైజాంలో ఈ సినిమా 8 కోట్ల రూపాయలు బిజినెస్ చేసింది. ఆంధ్రా-సీడెడ్ కలిపి 13 కోట్లకు అటుఇటుగా (అడ్వాన్సులతో కలిపి) బిజినెస్ చేసింది. ఇక ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా కలుపుకొని ఈ సినిమాను 24 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్మారు. ఇందులోంచి హిందీని తీసేయాలి. ఎందుకంటే నార్త్ లో ఓన్ రిలీజ్ కు వెళ్తున్నారు.
సో.. ఖిలాడీ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 25 కోట్ల 50 లక్షల రూపాయలు రాబట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమే. ఓవైపు ఏపీలో పరిస్థితులు బాగాలేనప్పటికీ, 25 కోట్ల పైన వసూళ్లు పెట్ట కష్టమేం కాదు. అఖండ, బంగార్రాజు, పుష్ప లాంటి సినిమాలు సాధించి చూపించాయి. కాబట్టి రవితేజ సినిమాలో కంటెంట్ క్లిక్ అయితే పాతిక రాబట్టడం కేక్ వాక్.
రమేష్ వర్మ దర్శకత్వంలో, కోనేరు సత్యనారాయణ నిర్మాతగా తెరకెక్కింది ఖిలాడీ సినిమా. మాస్ రాజా కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా గుర్తింపు పొందింది. అంతేకాదు, ఈ సినిమాతో తన కెరీర్ లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ కూడా అందుకున్నాడు రవితేజ. సో.. ఈ సినిమా కచ్చితంగా ఆడాలి. లేదంటే రవితేజ మార్కెట్ మళ్లీ పడిపోతుంది.