ఎన్నో ఏళ్ళ నుంచి కలగా ఉన్న అయోధ్య రామమందర భూమి పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వచ్చి రామమందిరానికి భూమి పూజ చేశారు. ఇక మోడీ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు అయితే సోషల్ మీడియా లో మోడీ ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తేశారు.
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో మోదీ.. బాల రాముడి చేయి పట్టుకుని రామ మందిరం వైపు నడిపిస్తున్నారు. ఈ ఫొటోపై సీనియర్ హీరోయిన్, తమిళనాడు కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ తనదైన శైలిలో స్పందించారు. ఇప్పుడు రాముడి కంటే మోదీ పెద్దవాడయ్యారన్నమాట. ఏం కలియుగం` అంటూ ఖుష్బూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
Wow..so now #Modi is larger than #LordRam. Kya kalyug hai. https://t.co/wXUnCPAUKV
— KhushbuSundar ❤️ (@khushsundar) August 5, 2020