ఏపీ నుంచి కియా తరలిపోతుందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. కియా పరిశ్రమ ఎక్కడికి వెళ్లడం లేదని వదంతులను నమ్మవద్దని తేల్చిచెప్పారు. అసలు ఈ రకమైన వార్తలు ఎందుకు ప్రచారం అవుతున్నాయో తమకు కుడా తెలియదని కియా సంస్థ చెప్పినట్లు మంత్రి తెలిపారు. తాము ఇస్తోన్న సహాకారంతో కియా సంస్థ యాజమాన్యం సంతృప్తిగా ఉందన్నారు. కొంతమంది పని గట్టుకొని ఇలాంటి రకమైన ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. మరోసారి ఇలాంటి ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ ప్రభుత్వ హయాంలో 1250కంపెనీలకు భూములను కేటాయించామని చెప్పారు. టీడీపీ హయాంలో కంటే తాము అధికారంలోకి వచ్చాకే పెట్టుబడులు మరింత పెరిగాయన్నారు.